కేర‌ళ‌లో విషాదం.. కొండ‌చ‌రియ‌లు విరిగి ఎనిమిది మంది మృతి!

క‌లం, వెబ్‌డెస్క్‌: కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు (Kerala Rains) బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. గ‌త రెండు రోజుల నుంచి కురుస్తున్న వ‌ర్షాల‌తో ప‌లు జిల్లాల్లో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి (Landslides) వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 8 మంది మృతి చెందారు. కొచ్చి-ధ‌నుష్‌కోటి జాతీయ ర‌హ‌దారితో పాటు ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎరాట్టుపేట, కంజిరాపల్లి, కూట్టిక్కల్ వంటి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వందిపెరియార్‌లోని 183వ జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేసింది. సీఎం వీడీ సతీషన్ ఉన్న‌తాధికారులు, జిల్లా కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించారు. కొల్లం, తిరువసంతపురం మినహా మిగతా 13 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులతో పాటు అత్యవసర రెస్క్యూ బృందాలను మోహరించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షేత్ర స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాల‌ని, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>