నానో యూరియాపై రైతుల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ పిలుపు

కలం , మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : యూరియాను అధిక మొత్తంలో వినియోగిస్తుండడంతో వ్యవసాయ క్షేత్రాలు సారవంతతను కోల్పోతున్నాయని, అన్నదాతలు నానో యూరియా ఎక్కువగా వినియోగించేలా వాటి అమ్మకాలను పెంచాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Gadwal Collector) అన్నారు.

శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని వెంకటరమణ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్,. సీడ్స్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల విత్తనాలు, ఎరువుల విక్రయాలు, వాటి ధరల గురించి దుకాణ యజమానిని అడిగారు. వివిధ స్టాక్ రిజిస్టర్ లను, పలు కూరగాయల విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. యూరియాను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తుండడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా చేయాలని ఆదేశించారు.

రైతులు ఎక్కువగా నానో ఏరియా వినియోగించేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్ నినో నేపథ్యంలో వర్షాలు తక్కువగా కురుస్తుండడంతో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలైన కందులు, కూరగాయలు, తదితర సాగుపై ఎక్కువగా దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. పెస్టిసైడ్స్, సీడ్స్, ఫర్టిలైజర్స్ దుకాణాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, ఏడిఏ సుబ్బారెడ్డి, ఏవో సురేష్ గౌడ్, ఏఈఓ నరేష్, తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>