హేట్ స్పీచ్ బిల్లుపై ఎమ్మెల్యే కూనంనేని కీలక సూచనలు

​కలం, ఖమ్మం బ్యూరో : పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ద్వేషపూరిత ప్రసంగాల నిరోధక బిల్లు ఉండకూడదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు. తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాల (నిరోధక) బిల్లు-2026పై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక సెలెక్ట్ కమిటీ తొలి సమావేశంలో ఆయన సభ్యునిగా పాల్గొన్నారు.

​అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ద్వేషపూరిత వ్యాఖ్యలను అరికట్టే క్రమంలో సాధారణ రాజకీయ విమర్శలకు, పౌర స్వేచ్ఛకు భంగం కలగకుండా చట్టంలో స్పష్టమైన పరిమితులు విధించాలని సూచించారు. బిల్లులోని ద్వేషపూరిత ప్రసంగాల నిర్వచనం, శిక్షలు, జరిమానాలు, డిజిటల్ మీడియా నియంత్రణ నిబంధనలను పునఃసమీక్షించాలన్నారు.

సాహిత్యం, కళలు, పరిశోధనలు, సమాజ హితం కోసం చేసే విమర్శలకు ఈ చట్టం నుంచి మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా అన్ని వర్గాల అభిప్రాయాలతో సమగ్ర నివేదికను శాసనసభకు సమర్పిస్తామని కూనంనేని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>