చేగుంటలో అక్రమ గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చేగుంట (Chegunta) మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రాలపై సివిల్ సప్లై, పోలీస్, రెవెన్యూ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. మక్కరాజ్ పేట చౌరస్తాలోని మూడు షాపుల్లో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల నుంచి రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో 16 గ్యాస్ సిలిండర్లతో పాటు రీ ఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>