మెట్‌పల్లి చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద విషాదం

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లా మెట్‌పల్లి (Metpally) పట్టణంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరులో ప్రమాదవశాత్తు పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన కాంపల్లి పోచయ్య (68) స్నానానికి కోనేరుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.

Also Read : ప‌వ‌న్ భార్య దాతృత్వం.. బ‌ర్త్‌డే రోజు ఏం చేసిందంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>