గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన

కలం, ములుగు : ములుగు జిల్లా మంగపేట (Mangapeta) మండలంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) శనివారం పర్యటించారు. గోదావరి నదిలో పెరుగుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆమె, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

అనంతరం మంగపేట గోదావరి కరకట్ట నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి, బ్యాక్‌వాటర్ ప్రభావంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి 28 కుటుంబాలకు చెందిన 112 మందిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వివరించారు. అక్కడ కల్పించిన సౌకర్యాలపై మంత్రి ఆరా తీసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని, నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క (Seethakka) హెచ్చరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను మరింత వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య వసతులు, విద్యుత్ తదితర అన్ని మౌలిక సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>