కలం, నిర్మల్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu), రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ (Gaddam Vivek) శనివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన మంత్రులను జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు అధికారులతో కలిసి రోడ్డు మార్గాన కడెం ప్రాజెక్టు (Kadem Project) కు బయల్దేరారు. ప్రాజెక్టు పరిస్థితులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం, నీటి నిల్వలు, భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రుల పర్యటన సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్
Follow Us On : WhatsApp

