కలం, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి అంటి రాంబాబు (Ambati Rambabu) పై సీఐడీ కేసు నమోదైంది. ఓ టీడీపీ నేత ఫిర్యాదుతో మంగళగిరి సీఐడీ ఆఫీస్‌లో అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని, అంబటి రాంబాబు మధ్య కొద్ది రోజులుగా తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పెమ్మసాని చేతికి పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు ఉన్న ఏఐ వీడియోను అంబటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఓ టీడీపీ నేత ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదైంది.
Also Read : భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుంది: సజ్జల
Follow Us On : WhatsApp

