కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్న నిరసనల (POK Protests) పై పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పీవోకే నిరసనలపై స్పందించారు. ఆందోళనకారుల పట్ల పాకిస్థాన్ అరాచకంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ప్రజలను శతృవులు అనడం చూస్తే వారిపట్ల పాక్ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపుందో అర్థమవుతుందన్నారు.శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పౌరులపై బలప్రయోగం చేయడం ద్వారా 40 మందికి పైగా పౌరులు మరణించారని, చాలామంది తీవ్రంగా గాయపడ్డారని జైస్వాల్ వివరించారు. భారతదేశాన్ని రక్తసిక్తం చేయడానికి పాకిస్థానీ ప్రభుత్వం శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చిన ముజాహిదీన్‌లు ఇప్పుడు తమపైనే దాడి చేసి, దేశానికి వ్యతిరేకంగా ఆయుధాలుగా మారారని పాక్ ప్రధాని సహాయకుడు బహిరంగంగా అంగీకరించారని తెలిపారు.
హింసాత్మక ఘర్షణలు, రిగ్గింగ్ ఆరోపణల మధ్య ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికలు పాకిస్తాన్ ప్రభుత్వం పాలనకు నిదర్శనమని విమర్శించారు. అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ దురాగతాలను నిశితంగా పరిశీలించాలని కోరారు.
Also Read : తెలంగాణలో సర్ ప్రక్రియ పొడిగింపు
Follow Us On: Sharechat

