కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శుక్రవారం సాయంత్రం 4:00 గంటల సమయానికి నది నీటిమట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న అధికారులు వెంటనే అప్రమత్తమై రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల ధాటికి వరద ఉధృతి ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ముంపు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా సహాయక చర్యల కోసం యంత్రాంగాన్ని సంపూర్ణంగా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. స్థానిక ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.
Also Read : హీరోయిన్ రష్మిక మందన్నకు ప్రమాదం
Follow Us On : WhatsApp

