జూరాల ప్రాజెక్ట్ వద్ద పోలీస్ బందోబస్త్: గద్వాల ఎస్పీ

కలం, జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్ట్‌కు (Jurala Project) వరదల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ టి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అదనపు ఎస్పీ కె.శంకర్, గద్వాల డీఎస్పీ మొగిలయ్యతో కలిసి ఎస్పీ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈఈ నాగేశ్వరరావు కర్ణాటక నుంచి వస్తున్న వరద ప్రవాహం, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో, ఎత్తిన గేట్లు, భవిష్యత్‌లో ఏర్పడే పరిస్థితులను ఎస్పీకి వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 1,30,000 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా, 1,15,515 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 64 గేట్లలో 24 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తునట్లు వివరించారు.

ఆరు గ్రామాలు ప్రభావితం..

ఎస్పీ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కృష్ణా నదికి వచ్చే వరదలు, భారీ వర్షాల కారణంగా ఎలాంటి విపత్తు ఆఎదురైనా పోలీస్ శాఖ తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కర్ణాటక నుంచి వరద ప్రవాహం మరింత పెరిగితే ఆరు గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున, ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఇతర అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏఈలు సుదర్శన్, సిద్దయ్య, కిషోర్ కుమార్, గద్వాల రూరల్ ఎస్‌ఐ సీహెచ్. శ్రీకాంత్, ధరూర్ ఎస్‌ఐ నందీకర్ పాల్గొన్నారు.

Also Read : హీరోయిన్ రష్మిక మందన్నకు ప్రమాదం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>