కలం, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ప్రధాని సూర్య సరోవర్ యోజన (PM Surya Sarovar Yojana) పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 5070 కోట్లను కేటాయించింది. ఐదేళ్లలో 5000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది.
మరో ఐదేళ్లవరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని పొడిగించింది. ఈ మేరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూ.3,15,614 కోట్లను కేబినెట్ కేటాయించింది. ఖేలో ఇండియాకు రూ.29 వేల కోట్లు కేటాయించింది. సముద్ర మంథన్ పథకానికి రూ. 84,084 కోట్లను మంత్రి వర్గం కేటాయించింది. సొరంగాల నిర్మాణం కోసం రూ. 9,779 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: అందుకే మాట్లాడలేదు.. ‘నీట్’ లీక్ పై రాఘవ్ చద్దా స్పందన
Follow Us On : WhatsApp

