కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kantha Rao) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.
ఇటీవల ఈ నెల 26న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రేగా కాంతారావుపై ఒక కేసు నమోదైంది. ఒక యూట్యూబ్ ఛానెల్ పేరుతో తనను ఫ్లాట్‌కు పిలిపించి వేధించారంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించారని సదరు బాధితురాలు ఆరోపించింది. ఈ నేపథ్యంలో సంచలనంగా మారిన ఈ కేసులో రేగా కాంతారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: గ్రేటర్‌వాసులకు TGSRTC గుడ్ న్యూస్..
Follow Us On : WhatsApp

