సంస్థాన్ నారాయణపురం సర్వేల్ గురుకులంలో ప్రవేశాలు

కలం, చండూరు (సంస్థాన్ నారాయణపురం): సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల (Sarvel Gurukul) పాఠశాలలో 6,8 తరగతులలో విద్యార్థులను భర్తీ చేయడానికి ఆగస్టు 5న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరవ తరగతిలో 13 ఖాళీలు, ఎనిమిదో తరగతిలో 10 ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన విద్యార్థులు ఈ పాఠశాలలో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఆగస్టు 5న పరీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>