రాహుల్ గాంధీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. ఈ మేరకు ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ అగౌరవకరమైన భాషను ఉపయోగించినట్లు అందులో రాసుకొచ్చారు. ఈ నోటీసును స్వీకరించాలని, సమగ్ర పరిశీలన కోసం ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ కు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు. సమాధానం ఇచ్చేందుకు సైతం అమిత్ షాకు సరైన అవకాశం కల్పించలేదని ప్రస్తావించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>