‘లక్కీ భాస్కర్’ సీక్వెల్‌పై క్రేజీ అప్‌డేట్

కలం, సినిమా : యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri)  కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar).. 2024లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సీక్వెల్ కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. రీసెంట్‌గా  దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో లక్కీ భాస్కర్ సీక్వెల్ గురించి స్పందించారు.

‘లక్కీ భాస్కర్’ సినిమాకు సీక్వెల్ ఉంటుంది. కానీ ఆ సినిమాకు కాస్త సమయం పడుతుంది అని అన్నారు. సీక్వెల్‌ను ప్రారంభించే ముందు వెంకీ అట్లూరి మరో రెండు సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. వాటిలో ఒకటి పోలీస్ నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రం కాగా, మరొకటి పిల్లల కోసం రూపొందించే వినోదాత్మక చిత్రం అని సమాచారం. తాను కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయ్యాకే ‘లక్కీ భాస్కర్’ సినిమా సీక్వెల్‌ మొదలు పెడతానని వెంకీ అట్లూరి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>