కలం, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు (Kadem Project)కు వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో నీరు వచ్చింది చేరుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం క్షణక్షణం పెరిగిపోతోంది. వరద నీటిపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 16 గేట్లను ఎత్తి 1,69,430 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,21,704 క్యూసెక్కులు ఉండటంతో ప్రాజెక్టు నిండుకుండలా మారి సంద్రాన్ని తలపిస్తోంది.
కడెం ప్రాజెక్టు (Kadem Project) పూర్తి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 693.250కు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 2.13 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వరద ఉధృతి మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: విద్యా విప్లవానికి రేవంత్ సర్కార్ అడుగులు
Follow Us On: Instagram

