కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలోని 8వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ జెండా గద్దె కూల్చివేతను నిరసిస్తూ (BRS Protest) గురువారం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి కూల్చివేతల ఎజెండాతో రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
జెండా గద్దెలు కూల్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్న బీఆర్‌ఎస్ అభిమానాన్ని బలహీనపరచలేరని స్పష్టం చేశారు. నగరంలో ప్రజా సమస్యలను వదిలేసి కేవలం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నేతలు బచ్చు విజయ్ కుమార్, పగడాల నాగరాజు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు హెచ్చరించారు.
Read Also: ఆ పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారు.. అభిజీత్ సంచలన ఆరోపణలు
Follow Us On: Sharechat

