కలం, వెబ్ డెస్క్ : జాతీయ గేయం ‘వందేమాతరం’ కు చట్టపరమైన రక్షణను కల్పించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ‘వందేమాతరం’ బిల్లు (Vande Mataram Bill ) లోక్సభలో ఆమోదం పొందింది. విపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. ఇప్పటికే ఈ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదముద్ర లభించింది.
కాగా, ‘వందేమాతరం’ బిల్లులో భాగంగా ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ – 1971’ ( జాతీయ గౌరవానికి భంగం కలిగించే నిరోధక చట్టం) లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదన చేసింది. భారత గీయమైన ‘జనగణమన’ కు ఉన్న చట్టపరమైన రక్షణలు జాతీయ గీయమైన ‘వందేమాతరం’ కు వర్తించనుంది. దీంతో వందేమాతరాన్ని అవమానించినా, ఎవరైనా ఆలపిస్తున్న వేళ ఆటంకం కలిగించినా దాన్ని తీవ్ర నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. ‘వందేమాతరం’ బిల్లు (Vande Mataram Bill) ఆమోదం తర్వాత లోక్సభ రేపటికి వాయిదా పడింది.
Read Also: ఆ పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారు.. అభిజీత్ సంచలన ఆరోపణలు
Follow Us On : WhatsApp

