కలం, వెబ్ డెస్క్ : సినీ ప్రియులు ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారతీయ పురాణ కావ్యం ‘రామాయణ’ అధికారిక ట్రైలర్ (Ramayana Trailer) విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్, టాప్ నాచ్ వీఎఫ్ఎక్స్ (VFX) హంగులతో రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను సరికొత్త కావ్య లోకంలోకి తీసుకెళ్తోంది.
ఈ ట్రైలర్లో రాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్ అందరినీ ఆకట్టుకోగా, లంకాధిపతి రావణాసురుడిగా యశ్ పవర్ఫుల్ ఎంట్రీ అంచనాలను ఆకాశానికి చేర్చింది. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ గంభీరమైన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇక సీతాదేవి పాత్రలో సాయి పల్లవిని సరికొత్త కోణంలో ఆవిష్కరించారు. సాంప్రదాయ రూపంలోనే కాకుండా, చేతిలో ఖడ్గం పట్టిన వీర యోధురాలిగా సీతను చూపించడం సినిమాలో ఒక ప్రత్యేక ఆకర్షణ కానుంది.
విజువల్స్ పరంగా పుష్పక విమానం, ఐరావతం, జటాయువు వంటి పౌరాణిక అంశాలను కంటికి కట్టినట్లు, సహజంగా గ్రాఫిక్స్ లో తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా ఉంది. వీటికి తోడు అంతర్జాతీయ సంగీత దిగ్గజం హన్స్ జిమ్మర్, ఇండియన్ మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని (Ramayana Trailer) ప్రతి ఫ్రేమ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టెక్నికల్ వండర్‌గా రాబోతున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోనుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
Read Also: నల్లగొండలో 552 ఇళ్లు.. 9 ఏళ్లుగా ఎదురుచూపులే!
Follow Us On : WhatsApp

