కార్మిక వ్యతిరేక కోడ్‌లను రద్దు చేయాలి: CITU నల్లగొండ జిల్లా కార్యదర్శి సలీం

కలం, చండూరు: కార్మికుల నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సిఐటీయూ (CITU) నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. బుధవారం చండూరు మండల కేంద్రంలో చండూరు బజార్ హమాలీ యూనియన్ జెండాను ఎండీ సలీం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్లకు ప్రయోజనాల కోసం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, 4 లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందని ఆరోపించారు.

లేబర్ కోడ్ రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ 30 కోట్ల మంది కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారన్నారు. 1926లో బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం హరించి వేయడం అన్యాయమన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ, సీనియర్ నాయకులు మోగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కత్తుల సైదులు, బిపంగి నాగరాజు, ముత్తమ్మ, గండూరి వెంకన్న, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, గొల్లూరి నాగరాజు, రమేశ్, సురేశ్, జానీ, వెంకన్న, రామ్మూర్తి, నరసింహ, బిక్షం, నగేశ్, సుమన్, అశోక్, శివ, నరేష్ నాగరాజు, సుమన్, నరేశ్, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు కట్ట పద్మ, నారపాక నాగమణి, వరలక్ష్మి గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు నాంపల్లి శంకర్,రేవల్లి సైదులు, దాసరి కృష్ణయ్య, యాదయ్య పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>