ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదని స్నేహితుల వినూత్న ప్రతీకారం..!

కలం, వెబ్ డెస్క్ : స్నేహితులు అంటేనే సరదాలు, అల్లరి, ఒక్కోసారి ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. ఇలాంటి కోవలోనే తమ ఫోన్ కాల్స్ ను లిఫ్ట్ చేయట్లేదని ఫ్రెండ్ పై కోపంగా ఉన్న అతని స్నేహితుల బృందం వినూత్న రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. డప్పు చప్పుళ్లతో అతని ఇంటికి వెళ్లి అతని స్నేహితులు నానా హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Friends Viral Video) అవుతోంది.

కుమార్ అనే వ్యక్తి తన స్నేహితుల ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేయకపోవడంతో చిర్రెత్తిపోయిన అతని ఫ్రెండ్స్ ఈ రకంగా వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ మేరకు ‘కుమార్ భాయ్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, బ్యాండు మేళాలతో అతని ఇంటికి వెళ్తున్నాం’ అంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. డప్పు, చప్పుళ్లు, కేరింతలతో ఆ స్నేహితుల బృందం ఇంటి ముందుకు రావడంతో కుమార్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొంత సేపు విస్మయానికి గురయ్యారు. స్నేహితుల మధ్య ఈ ఫన్నీ బాండింగ్‌ను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. “నిజమైన స్నేహితులు అంటే వీళ్లే” అంటూ కొందరు.. మా ఫ్రెండ్‌కు కూడా ఇదే ట్రీట్ ఇవ్వాలని ఇంకొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>