బాసర గోశాలల నిర్మాణానికి ఎమ్మెల్యే పవార్ రామారావు భూమిపూజ

కలం, నిర్మల్: బాసరలోని (Basara) జ్ఞానసరస్వతి అమ్మవారి క్షేత్రంలోని కృష్ణ మందిరం, వేద పాఠశాలలో గోశాలల నిర్మాణానికి రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం భూమిపూజ చేశారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా ముందుగా జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో గోశాలల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సరస్వతి శిశు మందిర్ పాఠశాల భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>