కలం, వెబ్ డెస్క్: హైడ్రాపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా (HYDRAA) వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోర్ట్‌ఫోలియోలో ఉన్న అంశమని, కాబట్టి దానిపై తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని పేర్కొన్నారు.
హైడ్రా గురించి తనను ఏమీ అడగొద్దని మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇదే సమయంలో హైడ్రా వ్యవహారంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం అర్థరహితమని, రాజకీయ లబ్ధి కోసమే వారు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: స్వర్ణ ప్రాజెక్టు గేటు మొరాయింపు.. తాళ్లతో కట్టిన అధికారులు
Follow Us On: Instagram

