మున్సిపల్ పాలనపై నిర్మల్ బీజేపీ కౌన్సిలర్లకు ప్రత్యేక శిక్షణ

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్లు (Nirmal BJP) ప్రత్యేక శిక్షణా తరగతులకు హాజరయ్యారు. మంగళవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శిక్షణా తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇటీవల ఎన్నికైన నూతన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు హాజరయ్యారు. నిర్మల్ నుంచి బీజేపీ కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చట్టాలు, నిధుల వినియోగం, పట్టణాభివృద్ధి కార్యక్రమాల అమలు, జనరల్ ఫండ్, ఎల్‌డీఎఫ్ నిధులు, కేంద్ర ప్రభుత్వ 15వ, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో కౌన్సిలర్లు గంజి రాజు, రావులవార్ విఠల్, కూన శశాంక్, జింక సురేందర్, శ్రీరామోజీ నరేష్, సూరజ్ నాయక్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>