తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర: పోలాడి

కలం, కరీంనగర్: విలువలు సిద్ధాంతాలకు నిలువెత్తు నిదర్శనం కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అని ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు (Poladi Rama Rao) కొనియాడారు. ప్రజా స్వామ్య విలువలకు కట్టుబడ్డ మహానేతగా దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తు చేశారు. కరీంనగర్‌లో మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జైపాల్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు.

తన అనర్గ ప్రసంఘాలతో పార్లమెంట్‌లో అన్ని పార్టీల నాయకుల ప్రశంసలు పొంది ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికైన జైపాల్ రెడ్డి (Jaipal Reddy).. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. అప్రజాస్వామికంగా అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్‌ను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. గవర్నర్ రాంలాల్ ద్వారా భర్తరఫ్ చేసినప్పుడు ప్రజాస్వామిక పునరుద్దరణ ఉద్యమంలో జైపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఉద్యమించి నెల రోజుల్లోనే ఎన్టీఆర్‌ను మళ్లీ సీఎం చేయడంలో ఆయన కీలక పాత్ర పొంచించారన్నారు.

హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్ మంజూరు చేయడంలో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా జైపాల్ రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రభివృద్ధిలో కృషి చేసిన సేవలు చిరస్మరనీయమని రామారావు కొనియాడారు. నేటి యువత జైపాల్ రెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అంబటి జోగి రెడ్డి, రొంటాల కేశవ రెడ్డి, సంధ్యా రాణి, అంజయ్య, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>