ఘనంగా ‘సైనికులకు వందనం.. రైతులకు నీరాజనం’

కలం, నిజామాబాద్ బ్యూరో: దేశానికి వెన్నుముక్క రైతు అయితే దేశ ప్రజలను దేశ సమైక్యతను సౌబ్రతత్వాన్ని చాటి చెప్పేది, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేది సైనికుడని పలువురు వక్తలు కొనియాడారు. అలాంటి అన్నదాతలను సైనికులను సన్మానించుకోవడం ఎంతో శుభ పరిణామం అన్నారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో స్నేహ సొసైటీ (Sneha Society) ఫర్ రూరల్ రీ‌ కన్‌స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల, టీఎంఆర్ ఫౌండేషన్ (TMR Foundation) సంయుక్త ఆధ్వర్యంలో ‘సైనికులకు వందనం – రైతులకు నీరాజనం’ పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తిపై చైతన్య కార్యక్రమాలను పురస్కరించుకొని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా మానసిక వికలాంగులకు యోగ డ్రాయింగ్ పెయింటింగ్ పోటీలు, అందులకు పాటల పోటీలను నిర్వహించారు. టీఎంఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాటి వీరేశం మనవడు తాటి స్తోత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అనంతరం సైనికులను, రైతులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా సైనికులను రైతులను ఘనంగా సన్మానించడం ఎంతో సంతోషకరమన్నారు. దేశానికి వెన్నుముక్క రైతు అయితే దేశ ప్రజలను దేశ సమైక్యతను సౌబ్రతత్వాన్ని చాటి చెప్పేది, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతూ సరిహద్దులో ధైర్యంగా నిలబడతారని తెలిపారు. అలాంటి వారిని సన్మానించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. అలాగే స్నేహ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొని దివ్యాంగ మానసిక విద్యార్థుల ఉన్నతీ కోసం స్నేహ సొసైటీ నిర్వాహకులు ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, సిబ్బంది చేయడం ఎంతో అభినందనీయమన్నారు.

ఇప్పటివరకు ఎంతో మందిని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో నిలిపే స్థాయికి తీసుకురావడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఇంకా చాలామంది దివ్యాంగ విద్యార్థుల్లో వెలుగులు నింపేందుకు నిరంతరంగా కృషి చేస్తుండడం వారి పట్టదల ఆశయ సాధనకు చెప్పుకోదగ్గ విషయం అని కొనియాడారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చేపట్టిన మానసిక దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ ఈ కార్యక్రమంతోపాటు స్నేహ సొసైటీ విద్యార్థులు ప్రదర్శించిన నాటక ప్రదర్శన, పాడిన పాటలు నృత్యాలు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారని వారు తెలిపారు. తమ వంతు బాధ్యతగా స్నేహ సొసైటీ దివ్యంగా విద్యార్థుల కోసం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని వారు చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, జిల్లా విశ్రాంత సైనికుల సంఘం అధ్యక్షుడు సుర హర ప్రసాద్, శ్రీ నూతన వైశ్య పాఠశాల అధ్యక్షుడు ఇంగు శివప్రసాద్, కార్యదర్శి, కొండ సత్య ప్రసాద్ మాజీ సైనికులు బాదావత్ రాజేందర్, రేకాజి రాజేశ్వర్, రైతులు అబ్బగోని గంగాధర్ గౌడ్, వరికూటి మాల కొండారెడ్డి, ఒంటిపల్లి శ్యామ్ కుమార్ లను స్నేహ సొసైటీ టీఎంఆర్ ఫౌండేషన్ ఘనంగా సన్మానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>