ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆయనపై పరారీలో ఉన్నట్లు ఆరోపణలు రావడంతో మంగళవారం మరోసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఊళ్లపాలెంకు వచ్చానని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన వివరణ ఇచ్చిన కొద్ది గంటలకే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

తెలంగాణ పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అక్కడనుంచి హైదరాబాద్‌కు ఆయన్ను తరలిస్తున్నారు. ఇప్పటికే మహిళా ట్రైనీని ప్రశ్నించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసు విచారణలో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహరంపై డీసీపీ లావణ్య నేతృత్వంలో సిట్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

Read Also: తెలంగాణలో కొత్త అవార్డు.. ఇదే మొదటిసారి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>