కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలోని మామడ మండల కేంద్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రజలు ఆకాంక్షించారు. మంగళవారం గ్రామదేవత ఎల్లమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: మలేషియా గోల్ఫ్ టోర్నీలో మెరిసిన గుంతాస్..
Follow Us On : WhatsApp

