ప్రపంచ పులుల దినోత్సవం.. స్టూడెంట్స్‌కి చిత్రలేఖన పోటీలు

కలం, నిర్మల్: ప్రపంచ పులుల దినోత్సవాన్ని (World Tiger Day) పురస్కరించుకుని విద్యార్థులకు సృజనాత్మకతమైన పోటీలు నిర్వహించారు. సారంగాపూర్ మండలం జామ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ నజీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పులుల ప్రాధాన్యతపై అవగాహన పెంచుతాయన్నారు.

భవిష్యత్ తరాలు ప్రకృతి, అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ బీట్ అధికారులు వెన్నెల, సుజాత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read Also : ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>