ఆలయాల అభివృద్ధితో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం: వాకిటి శ్రీహరి

కలం, నారాయణపేట: భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం (Pasupula Dattatreya Temple)లో 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధి ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధితోపాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పసుపుల దత్తాత్రేయ ఆలయం ఆధ్యాత్మిక విశిష్టతను మరింత పెంపొందించేలా చేపట్టనున్న అభివృద్ధి పనులు భక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాజేశ్వరి, తహసీల్దార్ సతీష్, అధికారులు రషీద్, వెంకటేశ్ శెట్టి, పసుపుల గ్రామ సర్పంచ్ మహేశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: పేపర్ల లీకేజీలపై శిక్షలు ఎక్కడ?: ప్రియాంక గాంధీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>