వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభం

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు అఖండ సాయి నామ సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ముధోల్ మండలం నుంచి వచ్చిన ప్రత్యేక భజన బృందం ఆధ్వర్యంలో 48 గంటల పాటు నిరాటంకంగా అఖండ సాయి నామ సంకీర్తన కొనసాగనుంది.

బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మధ్యాహ్న హారతి నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గురుపౌర్ణమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్గురువు ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి ఈవో భూమయ్య, సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>