గ్రామీణ ప్రతిభను ప్రపంచ స్థాయిలో నిలబెడతాం : వీసీ గోవర్ధన్

కలం, నిర్మల్ : బాసర ఆర్‌జీయూకేటీ (RGUKT Basara)లో 2026–27 విద్యా సంవత్సరానికి చేరిన పీయూసీ–I విద్యార్థులకు సోమవారం ఎస్‌ఏసీ ఆడిటోరియంలో ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే. గోవర్ధన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ప్రతిభను ప్రపంచ స్థాయి నైపుణ్యాలుగా తీర్చిదిద్దడమే ఆర్‌జీయూకేటీ ప్రధాన లక్ష్యమని అన్నారు.

సమయపాలన, క్రమశిక్షణ, స్వీయ అధ్యయనం, నైతిక విలువలు, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అలవరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు అకాడమిక్ విధానం, క్రమశిక్షణ, పరీక్షా విధానం, హాస్టల్ వసతులు, విద్యార్థి సంక్షేమం, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ ఓరియెంటేషన్‌ కార్యక్రమంలో అధ్యాపకులు, అధికారులు, నూతన విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>