కొత్తగూడెం అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) తెలిపారు. సుజాతనగర్ (Sujathanagar) మండల పరిధిలోని కార్పొరేషన్ డివిజన్‌లో సోమవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా రూ.1.95 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, బస్ షెల్టర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, సుజాతనగర్ కార్పొరేషన్ ప్రాంతంగా మారిన తర్వాత గ్రామాల రూపురేఖలు మార్చేలా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ప్రతి గ్రామంలో తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సుజాతనగర్ నుంచి శివాలయం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం నిధులు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. అలాగే సుజాతనగర్‌లో మున్సిపల్ సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు, సింగభూపాలెం చెరువుకట్ట అభివృద్ధికి త్వరలో రూ.5.5 కోట్ల నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు.

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘న్యాక్’ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం మంజూరైందని, నియోజకవర్గంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా పేద వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ, కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, పలువురు అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>