చలో ఢిల్లీ పోస్టర్​ ఆవిష్కరించిన సీపీఐ

కలం, నిర్మల్​ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ (CPI) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర, చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భూక్య రమేష్ మాట్లాడుతూ.. ఆగస్టు 6 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్త పాదయాత్రలు, సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఆగస్టు 6 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి దస్తూరాబాద్ వరకు 18 మండలాల్లో కొనసాగుతుందని తెలిపారు. కార్మికులు, రైతులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను “చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>