పేదలకు డబుల్​ బెడ్​రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ ఆందోళన

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. సొంత ఇళ్లు లేక అద్దె భవనాల్లో జీవనం సాగిస్తున్నామని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు సర్వే నిర్వహించి టోకెన్లు కూడా అందజేశారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఇండ్ల కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే అర్హుల జాబితాను పరిశీలించి తమకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేసి నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>