కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలం వెంకటాపురం పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (మత్స్యాద్రి) లో సోమవారం వరుణ యాగం నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకటయ్య పూజారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

