హైడ్రా పేరుతో ఎన్నో దారుణాలు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కలం, వెబ్ డెస్క్: హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్ట్ ఆదేశాలను బీఆర్ఎస్ స్వాగతిస్తోందని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. హైడ్రా పేరిట ఎన్నో దారుణాలకు పాల్పడ్డారని, చెరువుల సంరక్షణ పేరిట పేదల ఇళ్లను కూల్చేశారని ఆరోపించారు. హైకోర్ట్ వద్దని చెప్పినా.. కూల్చివేతలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కోర్టులు పనిచేయని శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టారని విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగులు.. తస్మాత్ జాగ్రత్త!

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చట్ట ప్రకారం, కోర్ట్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అన్ని చెరువులను కాపాడే హైడ్రా దుర్గం చెరువు పక్కన ఉండే రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి ఇంటిని ముట్టుకోలేదన్నారు. అందుకే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైడ్రాను రద్దు చేస్తామని కేసీఆర్ ఎప్పుడో ప్రకటించారని గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>