కలం, నకిరేకల్: మహిళల సంక్షేమం, సాధికారతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. నకిరేకల్ (Nakrekal) మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు మహిళలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలను ఆయన ఉత్సాహభరిత వాతావరణంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, రైతు నేత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తోందని, అందుకోసమే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన మహిళకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.
నూతన చీరలను అందుకని మహిళలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ.. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఎల్లవేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే వేముల వీరేశంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ వార్డు ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక మహిళలు, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

