నేడు య‌శోదా ఆస్ప‌త్రికి కేసీఆర్!

క‌లం, వెబ్‌డెస్క్‌: బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ (KCR) నేడు హైద‌రాబాద్‌లోని య‌శోదా ఆస్ప‌త్రికి వెళ్ల‌నున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి (Peddi Sudarshan Reddy) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై య‌శోదా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ నేడు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆస్ప‌త్రికి చేరుకొని పెద్ది కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు.

ఇప్ప‌టికే కేటీఆర్‌, హ‌రీశ్ రావు స‌హా ప‌లువురు బీఆర్ఎస్ ముఖ్య నేత‌లు య‌శోదాకు బ‌య‌లుదేరారు. కేసీఆర్ కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి సుద‌ర్శ‌న్ రెడ్డి ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. నేడు స్వ‌యంగా సుద‌ర్శ‌న్ రెడ్డికి వైద్యం చేస్తున్న డాక్ట‌ర్ల‌ను క‌లిసి మాట్లాడ‌నున్నారు. ప్ర‌స్తుతం సుద‌ర్శ‌న్ రెడ్డి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>