కలం, వెబ్ డెస్క్: నీట్ పరీక్షపత్రాల లీకేజీ, నిరుద్యోగ సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలు, నినాదాల హోరు మధ్యే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు రూపొందించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు’ను (Public Examinations Bill) లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్ సభలో ప్రతిపక్షాల నిరసనల మధ్యే ఆయన బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు, బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై అన్ని పార్టీలు మాట్లాడాలని కోరుతూ.. సవరణల కోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఇచ్చారు.

