ఢిల్లీ లాఠీచార్జిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

క‌లం, వెబ్‌డెస్క్‌: ఇటీవ‌ల ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న‌ల‌ సంద‌ర్భంగా యువ‌త‌పై జ‌రిగిన లాఠీ చార్జ్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా పోలీసుల తీరుపై కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆందోళ‌న చేసినంత మాత్రాన యువ‌త‌పై ఎలా లాఠీ చార్జ్ చేస్తార‌ని ప్ర‌శ్నించింది. శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని కోర్టు స్ప‌ష్టం చేసింది. కేవలం ఆందోళన జరుగుతుందనే కారణంతో లాఠీచార్జ్ చేయడం సమర్థనీయం కాదని తెలిపింది. పోలీసులు అతిగా వ్యవహరించారనే ఆరోపణలను స్వతంత్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సీజేఐ సూర్య‌కాంత్ వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా నిరసనలను ఎదుర్కొనేందుకు పోలీసులకు ఒకే విధమైన మార్గదర్శకాలు ఉండాలని సుప్రీం కోర్టు వెల్ల‌డించింది. లాఠీ చార్జ్ స‌మ‌యంలో గాయపడిన విద్యార్థులతో పాటు పోలీసులకు జ‌రిగిన న‌ష్టాన్ని కూడా సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. పోలీసులకు సరైన రక్షణ పరికరాలు అందుతున్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని పోలీసుల భ‌ద్ర‌త‌ను కూడా ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని సూచించింది. నిర‌స‌న‌ల నియంత్ర‌ణ‌లో చ‌ట్ట‌బ‌ద్ధ విధానాల‌నే అనుస‌రించాల‌ని పేర్కొంది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను రేప‌టికి వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>