కలం, వెబ్‌డెస్క్: బాక్సింగ్ రింగ్‌లో పాకిస్తాన్‌పై భారత్ పంచ్‌ల వర్షం కురిపించింది. కామన్వెల్త్ గేమ్స్ (CWG) 2026లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ (Jadumani Singh) అదరగొట్టాడు. పురుషుల 55 కేజీల విభాగంలో భాగంగా జరిగిన రౌండ్ ఆఫ్ 16 పోరులో పాకిస్తాన్‌కు చెందిన సుమామా రెహ్మాన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా జాదుమణికి అనుకూలంగా రిజల్ట్ ప్రకటించారు. ఈ విజయాన్ని కార్గిల్ యుద్ధ వీరులకు అంకితం చేస్తున్నట్లు జాదుమణి వెల్లడించాడు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంలో పాకిస్తాన్ బాక్సర్‌పై విజయం సాధించడం ప్రత్యేకంగా నిలిచిందని జాదుమణి తెలిపాడు. ‘‘నా విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నాను. పాక్‌పై గెలవడం చాలా సంతోషంగా ఉంది. క్వార్టర్‌ఫైనల్‌లో మరింత మెరుగ్గా రాణించి భారత్‌కు స్వర్ణ పతకం సాధించేందుకు ప్రయత్నిస్తాను’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. మణిపూర్‌కు చెందిన ఈ బాక్సర్ గతంలో వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 50 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు.
ఇప్పుడు క్వార్టర్ ఫైనల్‌లో గెలిస్తే కనీసం కాంస్య పతకం ఖాయం కానుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరఫున బాక్సింగ్ విభాగంలో పతకం ఆశలను జాదుమణి సజీవంగా ఉంచాడు. కాగా, ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ అనంతరం జాదుమణిని అభిమానులు భుజాలపై ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు. జాదుమణికి దేశ వ్యాప్తంగా ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

