సరస్వతి అమ్మవారికి కార్మిక శాఖ కమిషనర్ పూజలు

కలం, నిర్మల్: బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ పమేలా సత్పతి (Pamela Satpathy) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అంజనీ దేవి, సహాయ కార్యనిర్వహణాధికారి గంగా శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో కమిషనర్‌కు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు పమేలా సత్పతి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.

మాధవానంద పీఠం జగద్గురువు పూజలు..

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలోని బాలాలయంలో సదానంద మఠం తోగుట పీఠాధిపతి, మాధవానంద పీఠం జగద్గురువు శ్రీ మాధవానంద స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు, ఆలయ అధికారులు, అర్చకులకు అనుగ్రహ భాషణం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>