కలం, కరీంనగర్ బ్యూరో: మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చింతకుంట, కిసాన్ నగర్, శివాజీ నగర్, పసుల నారాయణ కాలనీ ప్రాంతాల్లో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్నూరు కార్పొరేషన్ ఛైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నర్సన్న పాల్గొని బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

