కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Nizamabad SRSP) బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఆదివారం నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని స్థానికులు కాపాడారు. గల్లంతైన నలుగురిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నగరానికి చెందిన ఆరుగురు యువకులు ఆదివారం సరదాగా గడుపుదామని ముప్కాల్ మండలంలోని లక్ష్మి హెడ్ రెగ్యులేటరీ వద్దకు వెళ్లారు. ఈత రాదని ఒకరు ఒడ్డున ఉండగా మిగతా ఐదుగురు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లోకి స్నానం కోసం దిగారు.
నీటిలోకి దిగిన యువకులు ఒకరి తర్వాత ఒకరు గల్లంతయ్యారు. దీంతో ఒడ్డున కూర్చున్న యువకుడు గట్టిగా కేకలు వేశాడు. యువకుడి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని ఒకరిని కాపాడారు. మిగతా నలుగురు నీటిలోనే గల్లంతయ్యారు. ముప్కాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటి తర్వాత ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మరికొంత సేపటికి మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసు కమిషనర్ సాయి చైతన్య కూడా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Read Also: స్క్వాష్‌లో భారత్ సత్తా.. అనహత్‌కు గోల్డ్ మెడల్
Follow Us On : WhatsApp

