హైదరాబాద్‌కు పెద్ది సుదర్శన్ రెడ్డి.. గ్రీన్ ఛానెల్ ద్వారా తరలింపు!

కలం, వరంగల్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) గుండెపోటుకు గురై హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, పలువురు పార్టీ ముఖ్య నేతలు హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి చేరుకున్నారు.

ఆసుపత్రికి చేరుకున్న అనంతరం వారు సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలను, ప్రస్తుత ఆరోగ్య స్థితిని అక్కడ ఉన్న వైద్యులతో స్వయంగా సమీక్షించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం కోలుకుంటున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అయితే, ఆయనకు మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, వేగంగా హైదరాబాద్ చేరుకోవడానికి వీలుగా అత్యవసర “గ్రీన్ ఛానెల్” ఏర్పాటు చేశామని వినోద్ కుమార్ వెల్లడించారు. అంబులెన్స్ వెంటే కేటీఆర్, హరీశ్ రావు హైదరాబాద్‌కు బయలుదేరారు.

Read Also: పంజాబ్ పేప‌ర్ లీకులు.. సీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ల‌పై విమ‌ర్శ‌లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>