నల్లగొండలో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ

కలం, నల్లగొండ : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థులకు సంఘీభావంగా నల్లగొండ (Nalgonda) జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం క్లాక్‌టవర్ సెంటర్ వద్ద బృహత్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరంతరం విద్యార్థులు, యువతకు అండగా నిలబడి పోరాటం చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని పేర్కొన్నారు.

“నీట్ పేపర్ లీకేజీ వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబాల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ విఫల నిర్వహణకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన దోషులపై, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా కోరారు.

ఈ కొవ్వొత్తుల ర్యాలీలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ సామి, మండల అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, జడల చిన్న మల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డి. ముంతాజ్ అలీ, ప్రధాన కార్యదర్శులు ఏళ్ల రవీందర్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, వేముల గోపీనాథ్, జమ్మూ అశోక్, పెరుమండ్ల నరేష్, ఇందనూరి శ్రీను, జోలం మహేష్, హరీష్, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సుధ బాలకృష్ణ, వైస్ చైర్మన్ భార్గవ్, దొండ రమేష్ యాదవ్, చింతమల వెంకటయ్య, రఘుమా రెడ్డి తదితర ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>