కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు (Muralidhar Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నల్ల చీర ధరించారనే కారణంతో సీనియర్ మహిళా నేతతో పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదని సోషల్ మీడియాలో సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా నిలుస్తూ ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు.
సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని, తెలంగాణ మాజీ హోంమంత్రిగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో హోంశాఖను నిర్వహించిన తొలి మహిళగా ఆమెకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉందని మురళీధర్‌రావు గుర్తుచేశారు. వివిధ ప్రభుత్వాల హయాంలో మూడుసార్లు మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆమె సేవలందించారని తెలిపారు. పితృస్వామ్య భావజాలాన్ని చాలా కాలం క్రితమే ఆమె సవాల్ చేశారని కొనియాడారు. అలాంటి ఒక సీనియర్ మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరించడం వల్ల తనకు కోపం వస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా, మాజీ మంత్రి కొండా సురేఖ బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై మురళీధర్ రావు (Muralidhar Rao) ఇటీవల ఘాటుగా స్పందించారు. బీజేపీ డస్ట్ బిన్ కాదని, ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోబోమని కొండా సురేఖను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ సీనియన్ నేత, మహిళా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : సస్పెన్షన్ కాదు… బహిష్కరణ!: తాతా మధు, నవీన్ రెడ్డికి షాక్?
Follow Us On: X(Twitter)

