కలం, యాదగిరిగుట్ట : ప్రజల భద్రత కోసం నిత్యం విధులు నిర్వహిస్తూ పని ఒత్తిడిలో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న ఆర్కే & కామినేని హాస్పిటల్స్ కు యాదాద్రి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కామినేని హాస్పిటల్ అండ్ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఫంక్షన్ హాల్ లో జిల్లాలోని పోలీస్ సిబ్బందికి (Yadadri Police) ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు ఏర్పాటు చేశారు.
డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్. సి ఎచ్. అశ్లేష ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి న్యూరో, కార్డీయో, ఈసీజీ, టుడి ఇకో, ఆర్థోపెడిక్, గైనిక్, షుగర్, బీపీ, వంటి టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్పి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఆరోగ్య స్థితి గతులను తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పరీక్షలతో పాటు ఉచితంగా మెడిసిన్స్ పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి లక్ష్మీనారాయణ, డిసిపి శ్రీనివాస్ నాయుడు, టౌన్ సీఐ భాస్కర్, రూరల్ సీఐ శంకర్ గౌడ్, ట్రాఫిక్ సీఐ కృష్ణ, ఎస్ఐలు, పోలిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Also: నా ఇలాఖాలో మీ జోక్యమేంటి..? కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సామేల్ ఫైర్
Follow Us On: Instagram

